'చిత్రలహరి' టీజర్.. మెగా మేనళ్లుడు ఇంప్రెస్ చేశాడు..!

March 13, 2019


img

మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ హీరోగా కిశోర్ తిరుమల డైరక్షన్ లో వస్తున్న సినిమా చిత్రలహరి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్ కొద్ది గంటల క్రితం రిలీజైంది. తేజూ సరసన నివేదా పేతురాజ్, కళ్యాణి ప్రియదర్శిని నటిస్తున్న ఈ సినిమా టీజర్ ఇంప్రెస్ చేసింది. చిత్ర.. లహరిల మధ్య విజయ్ అనే కుర్రాడి జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది అన్నది చిత్రలహరి కథ అని తెలుస్తుంది.

పేరులో ఉన్న విజయం జీవితంలో లేదని బాధపడుతున్న హీరో.. ఇలా టీజర్ తోనే సినిమాపై ఓ మంచి పాజిటివ్ బజ్ క్రియేట్ చేశాడు దర్శకుడు కిశోర్. ఏప్రిల్ 12న రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ సినిమా ఫలితంపై సాయి ధరం తేజ్ కెరియర్ ఆధారపడి ఉంటుంది. వరుసగా ఆరు ఫ్లాపులు తీసిన తేజూ ఇప్పుడు కథల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. 

Related Post

సినిమా స‌మీక్ష