నేను నోరు విప్పితే మీ పరువుపోతుంది

March 12, 2019


img

ఒరు ఆధార్ లవ్ సినిమాలో ఓ చిన్న టీజర్ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన ప్రియా ప్రకాశ్ వారియర్ ఆ క్రేజ్ తో తెలుగులో ఆ సినిమాను రిలీజ్ చేసేలా చూశారు. లవర్స్ డే టైటిల్ తో ఆ సినిమా రిలీజైంది. కేవలం ఆ టీజర్ తప్పించి సినిమాలో పెద్దగా మ్యాటర్ లేదని ప్రేక్షకులు పెదవి విరిచారు. ఇదిలాఉంటే ఆ సినిమా రిలీజ్ తర్వాత తాను అసలు హీరోయిన్ అయితే కనుసైగల టీజర్ పాపులర్ అవడంతో ప్రియా ప్రకాశ్ ను మెయిన్ లీడ్ చేశారని చెప్పుకొచ్చింది సినిమాలో మరో హీరోయిన్ నూరిన్ షరీఫ్.

ఇక రీసెంట్ గా డైరక్టర్ ఉమర్ లుల్లూ కూడా ప్రియా ప్రకాశ్ వల్లే సినిమా పోయిందని.. నూరిన్ కు అన్యాయం జరిగిందని చెప్పుకొచ్చాడు. అయితే ఈ కామెంట్స్ పై స్పందించిన ప్రియా ప్రకాశ్ నేను నోరు విప్పితే మీ పరువు పోతుందని.. అయినా ప్రతి ప్రశ్నకు విధి సమాధానం చెబుతుందని అన్నది. ఒరు ఆధార్ లవ్ టైంలో టీజర్ తో తనకు వచ్చిన క్రేజ్ తో చాలా ఆఫర్లు వచ్చాయని అయితే సినిమా పూర్తయ్యే వరకు వాటిని చేయడానికి వీళ్లేదని తన కెరియర్ కు అడ్డుగా ఉన్నారని రివర్స్ లో వేసుకుంది ప్రియా ప్రకాశ్. మరి వీరి గొడవ ఎక్కడికి వెళ్తుందో ఏమో కాని ప్రియా ప్రకాశ్ కు మాత్రం ఒకటి రెండు తెలుగు అవకాశాలు మాత్రం వచ్చినట్టు తెలుస్తుంది.Related Post

సినిమా స‌మీక్ష