ఒక్క సీన్ కోసం 37 టేకులట..!

March 12, 2019


img

సీనియర్ హీరో రమ్యకృష్ణ బాహుబలి శివగామి పాత్రలో మరోసారి తన సత్తా చాటారు. ఆ పాత్రలో ఆమె తప్ప మిగతా ఎవరు సూటవరు అనేంతగా రమ్యకృష్ణ నటించి మెప్పించింది. ఇన్నేళ్ల కెరియర్ లో ఇప్పటికి ఛాలెజింగ్ రోల్స్ చేస్తూ ప్రతిభ చాటుతుంది. ఇదిలాఉంటే ప్రస్తుతం కోలీవుడ్ లో మరో ప్రతిష్టాత్మక సినిమా చేస్తుంది రమ్యకృష్ణ. త్యాగరాజన్ కుమార్ రాజా డైరక్షన్ లో వస్తున్న సూపర్ డీలక్స్ సినిమాలో పోర్న్ స్టార్ గా నటిస్తుంది రమ్యకృష్ణ. 

సినిమాలో ఓ సీన్ కోసం ఏకంగా 37 టేకులు తీసుకుందట రమ్యకృష్ణ. ఈ పాత్రను చాలెంజింగ్ గా తీసుకుని చేశానని తప్పకుండా అందరికి నచ్చుతుందని చెబుతుంది రమ్యకృష్ణ. సినిమాలో విజయ్ సేతుపతి, సమంత కూడా నటిస్తున్నారు. ఈమధ్యనే టీజర్ తో అలరించిన సూపర్ డీలక్స్ లో ఎన్నో సర్ ప్రైజులు ఉంటాయని తెలుస్తుంది. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.  Related Post

సినిమా స‌మీక్ష