సొంత స్టోరీతో మెగా మేనళ్లుడు

March 12, 2019


img

కొన్ని సినిమాల అనుభవం తమలోని కొత్త కోణాన్ని బయటపెడుతుంది. హీరోగా చేస్తున్న వారిలో సినిమా తీయగలిగే సత్తా కూడా ఉంటుంది. టాలీవుడ్ స్టార్స్ ఎన్.టి.అర్, కృష్ణ వంటి వారు నటిస్తూ మెగా ఫోన్ పట్టిన సందర్భాలు ఉన్నాయి. ఇదిలాఉంటే మెగా హీరో మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ సొంత కథతో ప్రయోగం చేస్తున్నాడట. తేజూ ఏంటి కథ రాయడం ఏంటని అనుకోవచ్చు.. వరుసగా ఫ్లాపులు ఎదుర్కుంటున్న సాయి ధరం తేజ్ ప్రస్తుతం చిత్రలహరి సినిమా చేస్తున్నాడు.

కిశోర్ తిరుమల డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా ఏప్రిల్ లో రిలీజ్ అవుతుంది. ఇక ఈ సినిమా తర్వాత తేజూ సొంత కథతో సినిమా చేస్తాడని అంటున్నారు. ఈ సినిమాకు నూతన దర్శకుడు డైరెక్ట్ చేస్తాడని తెలుస్తుంది. ఇంతకీ సాయి ధరం తేజ్ ఎలాంటి కథ రాశాడు. అది ఎలా ఉండబోతుంది.. దీనికి సంబందించిన మరిన్ని డీటైల్స్ తెలియాల్సి ఉంది.  Related Post

సినిమా స‌మీక్ష