'మా' విజేత నరేష్..!

March 11, 2019


img

ఆదివారం జరిగిన మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ ఎలక్షన్స్ లో ఈసారి సీనియర్ నరేష్ ప్యానెల్ విజయం సాధించింది. 745 సభ్యులు ఉన్న మాలో ఆదివారం జరిగిన ఎలక్షన్స్ లో 473 మంది ఓట్లు వేశారు. సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగియగా రాత్రి 8 గంటలకు రావాల్సిన రిజల్ట్స్ అర్ధరాత్రి 1 తర్వాత ప్రకటించడం విశేషం. అప్పటివరకు కౌంటింగ్ జరిగినట్టుగా తెలుస్తుంది.  


'మా' కొత్త అధ్యక్షుడిగా నరేష్ ఎన్నికయ్యారు. ప్రత్యర్ధి శివాజి రాజాపై 69 ఓట్ల తేడాతో గెలిచారు నరేష్. ఎగ్జిక్యూటివ వైస్ ప్రెసిడెంట్ గా హీరో శ్రీకాంత్ మీద రాజశేఖర్ విజయం సాధించారు. వైస్ ప్రెసిడెంట్ గా శివాజి రాజా ప్యానెల్ నుండి పోటీపడిన ఎస్వి కృష్ణా రెడ్డితో పాటుగా స్వతంత్ర అభ్యార్ధిగా పోటీ చేసిన హేమ విజయం సాధించారు. జనరెల్ సెక్రటరీగా జీవితా రాజశేఖర్ విజయం సాధించారు. జాయింట్ సెక్రటరీగా గౌతం రాజు, శివ బాలాజిలు గెలిచారు.  


Related Post

సినిమా స‌మీక్ష