118 రివ్యూ & రేటింగ్

March 01, 2019


img

రేటింగ్ : 2.25/5 

కథ :

గౌతం (కళ్యాణ్ రాం) ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్.. ఓ రిసార్ట్ లో రూం నంబర్ 118లో స్టే చేయగా అతనికి ఓ కల వస్తుంది. ఆ కలలో జరిగింది నిజమా కాదా అని తెలుసుకునే క్రమంలో సైక్రియాటిస్ట్ ను కలవగా లూసిడ్ డ్రీమింగ్ గురించి చెబుతాడు. అయితే ఆ కల రావడానికి ఓ థియరీ ఉంటుంది. ఆ కలలో ఉన్న అమ్మాయి గురించి వేట మొదలు పెడతాడు గౌతం.. ఈ మధ్యలో అతని ఎదురైన సమస్యలేంటి.. అసలు ఆ అమ్మాయి ఎవరు..? ఎందుకు గౌతం కలలోకి వచ్చింది అన్నది సినిమా కథ.     

విశ్లేషణ :

సినిమాటోగ్రాఫర్ గా ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు పనిచేసిన గుహన్ డైరెక్ట్ చేసిన సినిమా 118. అయితే ఈ సినిమా కథ బాగా రాసుకున్నప్పటికి ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే సీన్స్ రొటీన్ గా అనిపించడం వల్ల డిజప్పాయింట్ అయ్యేలా చేస్తుంది. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీకి తర్వాత ఏం జరగబోతుంది అనే ఎక్సైటింగ్ కనిపించాలి. 

ఈ సినిమాలో కొన్ని సీన్స్ మాత్రమే అలా అనిపిస్తాయి. ఫస్ట్ హాఫ్ మొత్తం సినిమా చాలా వేగంగా నడిపించిన గుహన్ సెకండ్ హాఫ్ మాత్రం అనుకున్న విధంగా సాగించలేదు. ప్రీ క్లైమాక్స్ నివేదా థామస్ ఎపిసోడ్ మొత్తం రొటీన్ గా అనిపిస్తుంది. ఇక క్లైమాక్స్ కూడా అనుకున్న విధంగా ఉండదు. 118 కళ్యాణ్ రాం చేసింది మంచి ప్రయత్నమే అయినా ప్రేక్షకులు ఎంగేజ్ అయ్యేలా స్క్రీన్ ప్లే లేకపోవడం వల్ల అనుకున్న రేంజ్ లో సినిమా అనిపించదు.

నటన, సాంకేతికవర్గం :

కళ్యాణ్ రాం గౌతం పాత్రలో మెప్పించాడు. సినిమాలో కళ్యాణ్ రాం లుక్ కూడా బాగుంది. షాలిని పాడే పెద్దగా స్కోప్ ఉన్న పాత్రలో నటించలేదు. అయితే సినిమాకు మెయిన్ హీరోయిన్ గా నివేదా థామస్ నటించింది. తన పాత్ర వరకు ఆమె ప్రాణం పెట్టి చేసింది. ప్రభాస్ శ్రీను, నాజర్, రాజీవ్ కనకాల పాత్రలు ఏదో ఉన్నాయంటే ఉన్నాయన్నట్టుగా అనిపిస్తుంది. విలన్ ను సరిగా వాడుకోలేదు.

ఇక టెక్నికల్ టీం విషయానికొస్తే.. దర్శకుడు కెవి గుహన్ సినిమాటోగ్రఫీ అందించడంతో ప్రతి ఫ్రేం బాగుంది. అయితే కథ బాగున్నా కథనంలో లోటు పాట్లు కనిపించాయి. చివర్లో ఆడియెన్స్ ను సర్ ప్రైజ్ చేసేలా ఏదైనా ప్లాన్ చేసి ఉంటే బాగుండేది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. శేఖర్ చంద్ర మ్యూజిక్ ఇంప్రెస్ చేసింది. బిజిఎం ఆకట్టుకుంది.

ఒక్కమాటలో :

కళ్యాణ్ రాం 118.. థ్రిల్లరే కాని..!Related Post

సినిమా స‌మీక్ష