16 ఏళ్లు 793 సినిమాలు నిషేధించారట..!

February 20, 2019


img

సినిమా మొదలు పెట్టడం.. పూర్తి చేయడం కాదు.. సెన్సార్ క్లియరెన్స్ తో రిలీజ్ చేయడం కూడా ఓ పెద్ద పనే. అదేంటి అలా అంటారు అనుకోవచ్చు. ప్రతి సంవత్సరం అన్ని భాషల్లో రిలీజయ్యే వందల కొద్ది సినిమాల్లో ఎన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఎన్ని సినిమాలు సెన్సార్ దగ్గరే ఆగుతున్నాయో తెలుసుకోవాలని ఉత్తర ప్రదేశ్ కు చెందిన నూతన్ అనే బిజినెస్ మెన్ కు ఆలోచన వచ్చింది. సమాచార హక్కు చట్టం కింద ఆ వివరాలు సేకరించాడు. జనవరి 1 2000 నుండి, 2016 మార్చ్ 31 వరకు సెన్సార్ బ్యాన్ చేసిన సినిమాలు 793.  

ఇంతకీ ఈ 16 ఏళ్లలో ఎన్ని సినిమాలు సెన్సార్ అనుమతి పొందకుండా రిలీజ్ అవలేదు అంటే 793 సినిమాలని తెలిసింది. వీటిలో 586 ఇండియన్ సినిమాలు కాగా.. 207 విదేశీ సినిమాలు ఉన్నాయని తెలుస్తుంది. ఎక్కువగా హింది సినిమాలనే సెన్సార్ ఆపేసినట్టు తెలుస్తుంది. 231 హింది సినిమాలు సెన్సార్ అనుమతి నిరాకరించగా.. 96 తమిళ సినిమాలు.. 53 తెలుగు సినిమాలకు సెన్సార్ బ్రేక్ వేసిందట. 39 కన్నడ, 23 మళయాళ సినిమాలు సెన్సార్ క్లియరెన్స్ ఇవ్వలేదు. వీటిలో ఎక్కువగా అడల్ట్ కంటెంట్ తో పాటుగా వయిలెన్స్ తో కూడుకున్న సినిమాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తుంది. 



Related Post

సినిమా స‌మీక్ష