కోబ్రాపోస్ట్ ఆపరేషన్.. బుక్కైన బాలీవుడ్ సెలబ్రిటీస్

February 20, 2019


img

బాలీవుడ్ లో డబ్బు తీసుకుంటూ పార్టీ ప్రచారాలకు, ప్రభుత్వానికి సపోర్ట్ గా ట్వీట్స్ వేస్తూ డబ్బు సంపాదించే సెలబ్రిటీస్ గుట్టు రట్టు చేస్తూ కోబ్రాపోస్ట్ స్టింగ్ ఆపరేషన్ లో సంచలన విషయాలు వెళ్లడించింది. రానున్న లోక్ సభ ఎన్నికలకు పొలిటిషియన్స్ కు సపోర్ట్ గా ప్రమోట్ చేసేలా సెలబ్రిటీస్ ఓ డీల్ కుదుర్చుకున్నారు. ఈ లిస్ట్ లో ఒకరిద్దరు కాదు ఏకంగా 36 మంది బాలీవుడ్ సెలబ్రిటీస్ లిస్ట్ బట్టబయలు చేసింది కోబ్రాపోస్ట్.

సోషల్ మీడియాలో ప్రచారం చేసేందుకు ఈ సెలబ్రిటీస్ వారి నుండి డబ్బు తీసుకుంటారు. పైన ఓ డమ్మీ అగ్రిమెంట్ చేసుకుని లోపల మాత్రం వారు చేసే ప్రమోషన్ వేరేలా ఉంటుందట. ఈ లిస్ట్ లో శృంగారతార సన్ని లియోన్ తో పాటుగా బాలీవుడ్ హీరో వివేక్ ఓబేరాయ్, టైగర్ ష్రాఫ్, శక్తి కపూర్, రోహిత్ రాయ్, బాబా సెహగల్ ఇలా చాలామంది బాలీవుడ్ సెలబ్రిటీస్ ఉన్నట్టు తెలుస్తుంది.   



Related Post

సినిమా స‌మీక్ష