అప్పుడే అలాంటి రోల్ చేస్తున్నాడా..!

February 20, 2019


img

యువ సంచలనం విజయ్ దేవరకొండ తన ప్రతి సినిమా విషయంలో ప్రయోగాలకు పెద్ద పీట వేస్తాడని తెలిసిందే. లాస్ట్ ఇయర్ టాక్సీవాలా హిట్ తో మళ్లీ తన సత్తా చాటిన విజయ్ దేవరకొండ ప్రస్తుతం డియర్ కామ్రేడ్ సినిమా చేస్తున్నాడు. భరత్ కమ్మ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో విజయ్ కు జోడీగా రష్మిక మందన నటిస్తుంది. ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ క్రాంతి మాధవ్ డైరక్షన్ లో సినిమా చేస్తాడని తెలుస్తుంది.

ఈ సినిమాలో విజయ్ సింగరేణి కార్మికుడిగా కనిపిస్తాడట. అంతేకాదు సినిమాలో విజయ్ మిడిల్ ఏజ్ రోల్ చేస్తున్నాడని తెలుస్తుంది. అతనికి 10 ఏళ్ల బాబు కూడా ఉంటాడట. 30 ఏళ్లు కూడా రాని విజయ్ దేవరకొండ కెరియర్ లో మొదటిసారి మిడిల్ ఏజ్ రోల్ చేయడం పెద్ద సాహసమే అని చెప్పొచ్చు. మళ్లీ మళ్లీ ఇది రానిరోజు సినిమాతో హిట్ అందుకున్న క్రాంతి మాధవ్ రెండేళ్ల క్రైతం సునీల్ తో చేసిన ఉంగరాల రాంబాబు సినిమా డిజాస్టర గా మిగిలింది. అయినా సరే క్రాంతి మాధవ్ చెప్పిన కథ నచ్చడంతో విజయ్ దేవరకొండ సినిమాకు ఓకే చెప్ప్పాడట. ఈ సినిమాను కె.ఎస్ రామారావు నిర్మిస్తారని తెలుస్తుంది. 



Related Post

సినిమా స‌మీక్ష