బొమ్మరిల్లు భాస్కర్ తో అఖిల్

February 20, 2019


img

అక్కినేని నట వారసుడు అఖిల్ చేసిన 3 సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాన్ని అందుకోలేదు. అఖిల్, హలో సినిమాలు ఎలా ఉన్నా రీసెంట్ గా వచ్చిన మిస్టర్ మజ్ ను మీద ఎన్నో అంచనాలు ఉన్నాయి. అయితే ఆ అంచనాలను అందుకోవడంలో విఫలమైంది ఆ సినిమా. వెంకీ అట్లూరి డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాను బోగవల్లి ప్రసాద్ నిర్మించారు. ఇక ఈ సినిమా తర్వాత అఖిల్ పెద్దగా గ్యాప్ తీసుకోకుండా తన తర్వాత సినిమా ప్రయత్నాలు మొదలు పెట్టాడు.

మొన్నటిదాకా శ్రీను వైట్ల డైరక్షన్ లో అఖిల్ సినిమా ఉంటుందని వార్తలు రాగా ఇప్పుడు బొమ్మరిల్లు భాస్కర్ తో అఖిల్ సినిమా చేస్తున్నాడని అంటున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో బొమ్మరిల్లు భాస్కర్ ఓ సినిమా చేయాల్సి ఉంది. అఖిల్ కు సరిపోయే కథతో భాస్కర్ స్టోరీ నరేట్ చేశాడట. గీతా ఆర్ట్స్ బ్యానర్ అంటే స్క్రిప్ట్ బాగుంటుందని నాగార్జున కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. మరి అఖిల్, బొమ్మరిల్లు భాస్కర్ కాంబినేషన్ లో ఎలాంటి సినిమా వస్తుందో చూడాలి.

 


Related Post

సినిమా స‌మీక్ష