ఆఫ్టర్ రిలీజ్ క్లైమాక్స్ మారుస్తున్నారు

February 19, 2019


img

ఒక చిన్న టీజర్ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఒరు ఆదర్ లవ్ సినిమా తెలుగులో లవర్స్ డేగా రిలీజైంది. అల్లు అర్జున్ వచ్చి మరి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అటెండ్ అవగా సినిమాకు మంచి పబ్లిసిటీ వచ్చింది. రిలీజ్ ముందు కాస్త కూస్తో హడావిడి చేసిన ఈ సినిమా ఆఫ్టర్ రిలీజ్ ఏమాత్రం సందడి చేయలేదు. అయితే దర్శకుడు ఉమర్ లులు క్లైమాక్స్ మారుస్తున్నారట.

రిలీజ్ తర్వాత క్లైమాక్స్ మార్చి ఏం లాభం అనుకోవచ్చు. దీనిపై దర్శకుడు ఉమర్ లులు వర్షన్ ఎలా ఉంది అంటే తను ఇదవరకు తీసిన రెండు సినిమాలు రొమాంటిక్ ఎంటర్టైనర్స్ గా వచ్చాయని ఈ సినిమాను రియలిస్టిక్ కు దగ్గరగా తీసే ఆలోచనతో ట్రాజెడీ క్లైమాక్స్ పెట్టానని కాని ప్రేక్షకులు దాన్ని సరిగా రిసీవ్ చేసుకోలేదు. అందుకే మార్చిన క్లైమాక్స్ తో మళ్లీ మీముందుకు వస్తున్నాం అన్నారు ఉమర్ లులు. బుధవారం నుండి ఈ కొత్త క్లైమాక్స్ వస్తుందట. మరి ఈ క్లైమాక్స్ చూసి సినిమాను హిట్ చేస్తారేమో చూడాలి.  



Related Post

సినిమా స‌మీక్ష