బాహుబలికి ఏమాత్రం తగ్గదట..!

February 19, 2019


img

బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న ఆర్.ఆర్.ఆర్ సినిమాలో ఎన్.టి.ఆర్, రాం చరణ్ కలిసి నటిస్తున్నారన్న విషయం తెలిసిందే. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా కూడా పెద్ద స్కేల్ లో నిర్మించబడుతుంది. ఇక ఈ సినిమా గురించి రాజమౌళి మొదటిసారి మాట్లాడటం విశేషం. హార్వర్డ్ ఇండియా కాంఫరెన్స్ 2019లో పాల్గొన్న రాజమౌళి మొదటిసారిగా ఆర్.ఆర్.ఆర్ సినిమాపై స్పందించాడు.

బాహుబలి సినిమాలానే ఇది కూడా పాన్ ఇండియా సినిమాగా తెర్కెక్కిస్తున్నామని అన్నారు. బాహుబలికి ఆర్.ఆర్.ఆర్ ఏమాత్రం తీసిపోదని రాజమౌళి చెప్పిన మాటలు సినిమాపై మరింత అంచనాలు పెంచేస్తున్నాయి. ఇక సినిమా షూటింగ్ టైంలో టెన్షన్ గురించి ప్రశ్నిస్తే.. షూటింగ్ టైంలో జాలీగానే ఉంటుందని.. మనం ఏ వర్గం ప్రేక్షకులను అంచనా వేసుకుని చేస్తున్నామో తెలుసు కాబట్టి పెద్దగా టెన్షన్ ఉండదని.. కాకపోతే రిలీజ్ టైంలో ఏ సినిమాకైనా టెన్షన్ ఉంటుందని అన్నారు రాజమౌళి.



Related Post

సినిమా స‌మీక్ష