సుప్రియను పెళ్లాడుతున్న అడివి శేష్..?

February 19, 2019


img

లాస్ట్ ఇయర్ వచ్చిన స్పై థ్రిల్లర్ మూవీ గూఢచారి సినిమాతో తన ఖాతాలో మరో హిట్ వేసుకున్నాడు అడివి శేష్. తన సినిమాలకు తానే కథ అందించే అడివి శేష్ కెరియర్ మొదట్లో ప్రయత్నాలు విఫలమవగా క్షణం నుండి అతను ట్రాక్ ఎక్కాడు. గూఢచారి సినిమా తక్కువ బడ్జెట్ అసలు సిసలు స్పై థ్రిల్లర్ గా తెలుగు ప్రేక్షకులను అలరించింది. సినిమాలో అక్కినేని కుటుంబానికి చెందిన సుప్రియ కూడా నటించారు.

నాగార్జున మేన కోడలైన సుప్రియ పవన్ కళ్యాణ్ మొదటి సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయిలో హీరోయిన్ గా నటించింది. అయితే ఆ ఒక్క సినిమాతో ఆ సిల్వర్ స్క్రీన్ కు దూరంగా ఉంది. గూఢచారితో మళ్లీ తెర మీద కనిపించిన సుప్రియ ఆ సినిమా హీరో అడివి శేష్ ను పెళ్లాడుతుందని టాక్. 33 ఏళ్ల అడివి శేష్ 40 ఏళ్ల సుప్రియను పెళ్లాడుతాడా అంటే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందని దాన్నికి వయసు పెద్ద మ్యాటర్ కాదని తెలుస్తుంది. వీరిద్దరి పెళ్లికి ముఖ్య కారణం అక్కినేని కోడలు సమంత అని తెలుస్తుంది. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉంది అన్నది అఫిషియల్ గా తెలియాల్సి ఉంది.Related Post

సినిమా స‌మీక్ష