నాని విలన్ గా ఇంద్రగంటి మరో ప్రయత్నం..!

February 19, 2019


img

నానిని హీరోగా పరిచయం చేసిన ఇంద్రగంటి మోహనకృష్ణ నాని కెరియర్ మంచి ఫాం లో ఉన్న టైంలో జెంటిల్మెన్ సినిమాతో మరో హిట్ ఇచ్చాడు. నాని డ్యుయల్ రోల్ చేసిన జెంటిమెన్ సినిమా అటు ఇంద్రగంటి మోహనకృష్ణకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ప్రస్తుతం నాని మరోసారి ఇంద్రగంటి మోహనకృష్ణతో సినిమాకు సిద్ధమవుతున్నాడట. సమ్మోహనం తర్వాత నానికి సరిపోయే ఓ కథ సిద్ధం చేశాడట మోహనకృష్ణ.

దిల్ రాజు ఈ సినిమా నిర్మిస్తారని తెలుస్తుంది. ఇక ఈ సినిమా కూడా ప్రయోగాత్మకంగా ఉంటుందని తెలుస్తుంది. ఈ మూవీలో నాని విలన్ గా నటిస్తున్నాడని తెలుస్తుంది. సుధీర్ బాబు పోలీస్ పాత్రలో కనిపిస్తాడట. నాని రోల్ నెగటివ్ షేడ్స్ తో ఉంటుందట. అష్టాచమ్మ, జెంటిల్మెన్ తర్వాత ఇంద్రగంటి మోహనకృష్ణ నాని చేస్తున్న ఈ హ్యాట్రిక్ మూవీ ఎలా ఉంటుందో చూడాలి. ప్రస్తుతం నాని జెర్సీ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా ఏప్రిల్  రెండవ వారంలో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.   



Related Post

సినిమా స‌మీక్ష