మురారి దీక్షితులు కన్నుమూత..!

February 18, 2019


img

మురారి సినిమాలో దీక్షితులుగా నటించిన టాలీవుడ్ నటుడు, దర్శకుడు శ్రీనివాస దీక్షితులు సోమవారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. ఓ సినిమా షూటింగ్ లో ఉండగానే ఆయనకు గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయారట. అయితే హాస్పిటల్ కు తీసుకెళ్లే మార్గమధ్యంలోనే ఆయన మరణించారని సమాచారం. 

రంగస్థల నటులైన శ్రీనివాస దీక్షితులు కృష్ణవంశీ డైరక్షన్ లో మహేష్ బాబు హీరోగా నటించిన మురారి సినిమాలో మంచి పాత్ర చేశారు. అప్పటిదాకా చిన్న చిన్న పాత్రలను చేసుకుంటూ వచ్చిన శ్రీనివాస దీక్షితులు మురారి సినిమాతో మంచి అవకాశాలు సంపాదించారు. ఆ తర్వాత ఇంద్ర, ఠాగూర్, ప్రాణం, వర్షం, అతడు మొదలైన సినిమాల్లో నటించి మెప్పించారు శ్రీనివాస దీక్షితులు. గుంటూరు జిల్లా రేపల్లెకు చెందిన శ్రీనివాస దీక్షితులు 1956 జూలై 28న జన్మించారు. సినిమాల్లోనే కాదు సీరియల్స్ లో కూడా నటిస్తున్న శ్రీనివాస్ దీక్షితులు మరణానికి టివి, సిని నటులు షాక్ అవుతున్నారు. ఆయన కుటుంబానికి వారు ప్రగాడ సానుభూతి తెలుపుతున్నారు.  




Related Post

సినిమా స‌మీక్ష