సీనియర్ హీరోతో ఆరెక్స్ బ్యూటీ..!

February 18, 2019


img

టాలీవుడ్ సీనియర్ హీరోలకు తగిన జోడీ వెతకడంలో దర్శక నిర్మాతలు బాగా కష్టపడాల్సి వస్తుంది. చిరు, వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జున ఇలా అందరు సీనియర్ హీరోలకు హీరోయిన్స్ ఇబ్బంది తెలిసిందే. సినిమా కథ, కథనాలే కాదు సీనియర్ హీరోలకు హీరోయిన్స్ మాత్రం దొరకడం లేదు. ప్రస్తుతం ఉన్న భామలు వారితో చేసేందుకు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అయితే లేటెస్ట్ గా హీరోయిన్స్ ఆలోచన మారింది.

చిరంజీవి చేస్తున్న సైరాలో నయంతార రొమాన్స్ చేస్తుండగా.. వెంకటేష్ చేస్తున్న వెంకీ మామ సినిమాలో విక్టరీ వెంకటేష్ సరసన ఆరెక్స్ 100 భామ పాయల్ రాజ్ పుత్ సెలెక్ట్ అయిందని తెలుస్తుంది. ఆరెక్స్ 100 సినిమాతో యూత్ ఆడియెన్స్ ను అలరించిన పాయల్ రాజ్ పుత్ వెంకీ సినిమా ఆఫర్ అందుకోవడం లక్ అనే చెప్పాలి. వెంకీ మామ సినిమాలో నాగ చైతన్య కూడా నటిస్తున్నాడు. నాగ్ సరసన కూడా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుంది.  



Related Post

సినిమా స‌మీక్ష