మన్మధుడు-2లో ఆ ఇద్దరు భామలు..!

February 16, 2019


img

కింగ్ నాగార్జున దేవదాస్ సినిమా తర్వాత కొద్దిపాటి గ్యాప్ తీసుకున్నాడని తెలిసిందే. త్వరలో బంగార్రాజు సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్లనున్న నాగ్ ఆ సినిమాతో పాటుగా మన్మధుడు సీక్వల్ ను సెట్స్ మీదకు తెస్తున్నాడట. రాహుల్ రవింద్రన్ డైరక్షన్ లో ఇప్పటికే స్క్రిప్ట్ పూర్తి చేసుకున్న మన్మధుడు-2 సినిమా అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ త్వరలో రానుందట.

ఇక ఈ సినిమాలో హీరోయిన్స్ గా అనుష్క, పాయల్ రాజ్ పుత్ లను సెలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. నాగ్, అనుష్కల రొమాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పల్సిన పనిలేదు. లేటెస్ట్ గా మునుపటి రూపంతో అనుష్క మళ్లీ అదరగొట్టబోతుంది. ఇక ఆరెక్స్ 100 సినిమాతో అందరిని అలరించిన పాయల్ మరోసారి మన్మధుడు పక్కన హంగామా చేయనుంది. మరి ఈ ఇద్దరి భామలతో నాగ్ చేసే అల్లరి ఎలా ఉంటుందో చూడాలి.


Related Post

సినిమా స‌మీక్ష