పుల్వామా ఉగ్రదాడి.. విజయ్ దేవరకొండ ఫస్ట్ స్టెప్..!

February 16, 2019


img

దేశం మొత్తం కదిలించిన పుల్వామా ఉగ్రదాడిలో మన సైనికులు 40 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయని తెలిసిందే. పుల్వామా ఉగ్రదాడిని ప్రపంచం మొత్తం ఖండిస్తుంది. ఇక దీనికి ప్రతిగా మరోసారి సర్జికల్ స్ట్రైక్ జరగాల్సిందే అంటున్నారు భారత ప్రజలు. ఇదిలాఉంటే ఈ దుశ్చర్య మీద సెలబ్రిటీస్ సైతం తమ స్పందన తెలియచేశారు. 


ఇక విజయ్ దేవరకొండ మాత్రం ఆ సైనికుల కుటుంబాలకు ఆర్ధిక సాయం అందించేలా ఇండియాస్ బ్రేవ్ హర్ట్ కు కొంత మొత్తాన్ని చెల్లించాడు. దేశ సనికులు మన కుటుంబాలను రక్షిస్తున్నారు. వారి కుటుంబాలకు మనం సపోర్ట్ గా నిలవాల్సిన టైం వచ్చింది. నా ప్రయత్నంగా నేను కొంత సాయం చేశాను.. మీరు కూడా చేస్తారని ఆశిస్తున్నా అంటూ విజయ్ దేవరకొండ సోల్జర్స్ ఫ్యామిలీస్ కు సపోర్ట్ గా నిలవాలని ఫ్యాన్స్ కు పిలుపునిచ్చాడు. 


Related Post

సినిమా స‌మీక్ష