మహేష్ మహర్షి.. గుండె బరువెక్కడం ఖాయమట..!

February 15, 2019


img

సూపర్ స్టార్ మహేష్, వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో మహేష్ 25వ సినిమాగా వస్తున్న సినిమా మహర్షి. దిల్ రాజు, అశ్వనిదత్, పివిపి కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో మహేష్ సరసన పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమాలో మహేష్ స్నేహితుడిగా అల్లరి నరేష్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడని తెలుస్తుంది. అంతేకాదు సినిమాలో మహేష్ మూడు విభిన్న పాత్రల్లో కనిపిస్తాడట.

కమర్షియల్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాలో పేరెంట్స్ ఎమోషన్స్, ఫ్రెండ్ షిప్ బాండ్, ఫార్మర్ కష్టాలు ఇలా అన్నిటిని సినిమాలో టచ్ చేస్తున్నారట. భరత్ అనే నేను తర్వాత మహేష్ చేస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 25న రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాఎమోషనల్ సీన్స్ తో గుండె బరువెక్కడం ఖాయమని తెలుస్తుంది. ఇదే విషయాన్ని నిర్మాత దిల్ రాజు ఈమధ్య ఇంటర్వ్యూలో చెప్పాడు.   



Related Post

సినిమా స‌మీక్ష