లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ తీయడానికి కారణం ఇదే..!

February 15, 2019


img

 నందమూరి బాలకృష్ణ చేస్తున్న ఎన్.టి.ఆర్ బయోపిక్ కు పోటీగా అసలు కథ తాను చెబుతా అంటూ లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ అనే సినిమా మొదలుపెట్టాడు సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ. ఎన్.టి.ఆర్ జీవితంలోకి లక్ష్మీ పార్వతి ఎంట్రైన టైం నుండి ఈ సినిమా కథ మొదలవుతుంది. గురువారం రిలీజైన లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ ట్రైలర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. 

ఇదిలాఉంటే ఈ సినిమా రిలీజ్ డేట్ చెప్పకుండానే ప్రమోషన్స్ చేస్తున్నాడు వర్మ. అసలు తాను లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ సినిమా ఎందుకు తీయాల్సి వచ్చిందో చెబుతూ ఆర్జివి ఓ వాయిస్ మెసేజ్ పెట్టాడు. 1989 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్.టి.ఆర్ ఓడిపోయాక ఆయన ఆరోగ్యం పాడైంది. ఆ టైంలో ఆయన కుటుంబ సభ్యులెవరు పట్టించుకోకపోవడం వల్ల ఆయన ఏకాకి అయ్యాడు. ఆ టైంలో లక్ష్మీ పార్వతి అనే స్త్రీ ఎన్.టి.ఆర్ జీవితంలోకి ప్రవేశించింది. ఇక వారి మధ్య మొదలైన ఆ సంబంధం రాష్ట్ర రాజకీయాలను ఎలా మార్చేసింది.. ఎన్.టి.ఆర్ జీవితాన్ని కూడా ఎలా మర్చింది అన్న విషయాలను సినిమాలో చూపించబోతున్నామని అన్నారు వర్మ. మరి ఇంకా లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ గురించి వర్మ ఏమన్నాడో అతని వాయిస్ ఓవర్ లోనే వినండి..  





Related Post

సినిమా స‌మీక్ష