పూజా హెగ్దెని వదలని అల్లు అర్జున్..!

February 15, 2019


img

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు త్రివిక్రం ఇద్దరు కలిసి హ్యాట్రిక్ మూవీ చేయబోతున్నారని తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్, కియరా అద్వానిల పేర్లు వినపడగా ఫైనల్ గా డిజే భామ పూజా హెగ్దెని సెలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. ముకుంద సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన పూజా హెగ్దె దువ్వాడ జగన్నాథం సినిమాతో లైం లైట్ లోకి వచ్చింది. ఇక ఆ సినిమా నుండి స్టార్స్ అంతా ఆమెతో రొమాన్స్ చేస్తున్నారు.

లాస్ట్ ఇయర్ ఎన్.టి.ఆర్ తో అరవింద సమేత సినిమా చేసిన పూజా హెగ్దె ఆ సినిమా టైంలో త్రివిక్రం ను ఇంప్రెస్ చేసిందట. అందుకే బన్ని సినిమాకు ఆమెను రిపీట్ చేస్తున్నాడు మాటల మాంత్రికుడు. హారిక హాసిని క్రియేషన్స్ తో పాటుగా ఈ సినిమాలో గీతా ఆర్ట్స్ కూడా నిర్మాణ భాగస్వామ్యం అవుతుంది. మరి అల్లు అర్జున్ పూజా హెగ్దె ఈ హిట్ కాంబినేషన్ ఈసారి ఎలాంటి సందడి చేస్తుందో చూడాలి.  



Related Post

సినిమా స‌మీక్ష