అప్పటిదాకా ఆగాల్సిందేనా..!

February 14, 2019


img

కమర్షియల్ సినిమాలతోనే కాదు కంటెంట్ ఉన్న సినిమాలతో కూడా ఫీమేల్ లీడ్ గా వరుస హిట్లు కొడుతున్న లేడీ సూపర్ స్టార్ నయనతార కెరియర్ పరంగా ఫుల్ స్వింగ్ లో ఉందని చెప్పొచ్చు. తెలుగులో సీనియర్ స్టార్స్ కు సరైన జోడీగా ఈమే కాగా.. కోలీవుడ్ లో స్టార్స్ కు షాక్ ఇచ్చేలా ఈమె సినిమాల ఫలితాలు ఉన్నాయి. దర్శక నిర్మాతలు కూడా నయనతార కోసం కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నారు.

కెరియర్ సక్సెస్ ఫుల్ గా సాగుతుండగా ఇప్పుడప్పుడే పెళ్లి మీద దృష్టి పెట్టేట్లు లేదు నయనతార. కొన్నాళ్లుగా దర్శకుడు సంతోష్ శివన్ తో డేటింగ్ లో ఉన్న నయనతార పెళ్లెప్పుడు అంటే మాత్రం మాట దాటేవేస్తుంది. అయితే లేటెస్ట్ గా తను 100 సినిమాలు పూర్తి చేశాక పెళ్లాడుతా అని అంటుందట. ప్రస్తుతం నయనతార 60 సినిమాలు చేసింది. అంటే ఇంకా 40 సినిమాలు చేయాలి. వరుసగా కథలు వింటూ వాటిని ఓకే చేస్తుందట. ఇదే స్పీడ్ తో మరో ఐదేళ్లలో ఆ నలభై సినిమాలు పూర్తి చేసి అప్పుడు పెళ్లి చేసుకుంటా అంటుంది. మరి నయన్ ప్లాన్ బాగానే ఉన్నా అనుకున్నట్టుగా అన్ని సినిమాలు చేయగలుగుతుందో లేదో చూడాలి.  

 


Related Post

సినిమా స‌మీక్ష