వైష్ణవ్ తేజ్ కు విలన్ అవుతున్న విజయ్..!

February 13, 2019


img

మెగా ఫ్యామిలీ నుండి వస్తున్న మరో హీరో వైష్ణవ్ తేజ్ ఈమధ్యనే తన తొలి సినిమా ప్రారంభించిన విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ తో పాటుగా సుకుమార్ కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామ్యం అవుతున్నాడు. సుకుమార్ దగ్గర అసిటెంట్ గా పనిచేసిన బుచ్చిబాబు ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాలో విలన్ గా తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతిని సెలెక్ట్ చేశారని తెలుస్తుంది.

రంగస్థలం సినిమాలానే ఇది కూడా పిరియాడికల్ డ్రామాగా వస్తుందట. వైష్ణవ్ తేజ్ మొదటి సినిమాతోనే సత్తా చాటాలని చూస్తున్నాడు. ఇక సినిమాలో విజయ్ సేతుపతి కూడా నటించడం సినిమాకు అదనపు ఆకర్షణ అవనుంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది. మరి మొదటి సినిమానే క్రేజీ కాంబో సెట్ చేసుకున్న వైష్ణవ్ తేజ్ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.



Related Post

సినిమా స‌మీక్ష