మహేష్ ను మెప్పించిన దర్శకుడు..!

February 13, 2019


img

సూపర్ స్టార్ మహేష్ మహర్షి సినిమా తర్వాత సుకుమార్ తోనే సినిమా చేస్తాడని అంటున్నారు. అయితే మహేష్ 26వ సినిమా గురించి కన్ఫ్యూజన్ కొనసాగుతూనే ఉంది. సుకుమార్ ఇంకా మహేష్ ను మెప్పించే కథ సిద్ధం చేయలేదని.. లైన్ ఓకే చేసినా ఫుల్ స్క్రిప్ట్ ఇంకా ఓకే అవలేదని తెలుస్తుంది. ఇదిలాఉంటే ఈమధ్యనే మహేష్ ను కలిసి అనీల్ రావిపుడి ఓ కథ చెప్పాడట.


పటాస్ నుండి ఎఫ్-2 వరకు వరుస హిట్లు కొట్టిన అనీల్ మహేష్ కు ఓ మాస్ కథ చెప్పాడట. తన టాలెంట్ ఎలాగు ప్రూవ్ చేసుకున్న అనీల్ రావిపుడి చెప్పిన కథను అలానే తెరకెక్కించగలడని మహేష్ నమ్ముతున్నాడట. సుకుమార్ సినిమాను వెనక్కి నెట్టి అనీల్ తో తన నెక్స్ట్ సినిమా ప్లాన్ చేస్తున్నాడట మహేష్. ఈ కాంబినేషన్ ఓకే అయితే ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తారని తెలుస్తుంది.



Related Post

సినిమా స‌మీక్ష