సూపర్ హిట్ సీక్వల్ వస్తుంది..!

February 13, 2019


img

కోలీవుడ్ లో ఈమధ్య సీక్వల్ సినిమాల హవా నడుస్తుంది. ఈ క్రమంలో మరో సూపర్ హిట్ సినిమాకు సీక్వల్ త్వరలో ప్రారంభం కాబోతుందని తెలుస్తుంది. గౌతం మీనన్ డైరక్షన్ లో సూర్య హీరోగా 2003లో వచ్చిన సినిమా కాక్కా కాక్కా.. అక్కడ సూపర్ హిట్టైన ఈ సినిమాను తెలుగులో విక్టరీ వెంకటేష్ ఘర్షణగా రీమేక్ చేశారు. తమిళంలో హిట్ అయినంత గొప్పగా తెలుగులో కాలేదు కాని సినిమా పర్వాలేదు అనిపించుకుంది. 

ఇక ఇప్పుడు ఆ సినిమా సీక్వల్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయట. గౌతం మీనన్ ఆల్రెడీ ఈ సీక్వల్ స్క్రిప్ట్ రెడీ చేశాడట. ఈ సీక్వల్ లో కూడా సూర్య నటిస్తాడని తెలుస్తుంది. ప్రస్తుతం గౌతం మీనన్ విశాల్ తో ఓ సినిమా మొదలు పెడుతున్నాడు. ఆ సినిమా తర్వాత కాక్కా కాక్కా సీక్వల్ ఉంటుందని తెలుస్తుంది.



Related Post

సినిమా స‌మీక్ష