మహానాయకుడు రిలీజ్ డేట్ ఫిక్స్..!

February 12, 2019


img

ఎన్.టి.ఆర్ బయోపిక్ లో మొదటి పార్ట్ కథానాయకుడు జనవరి 9న రిలీజై అనుకున్నంత సక్సెస్ సాధించలేదు. అంచనాలను అందుకోలేని ఆ సినిమా వసూళ్ల పరంగా కూడా డిజాస్టర్ గా మిగిలింది. ఇక సెకండ్ పార్ట్ గా వస్తున్న మహానాయకుడు సినిమా మీద అందరి దృష్టి ఉంది. ఈ సినిమా అసలైతే ముందు జనవరి 25న రిలీజ్ అనుకోగా ఆ తర్వాత ఫిబ్రవరి 7కి మార్చారు. ఫైనల్ గా ఆ డేట్ ను మార్చి రిలీజ్ ఎప్పుడన్నది సస్పెన్స్ లో పెట్టారు.

అయితే మహానాయకుడు మరి లేట్ చేస్తే మళ్లీ ఏపి ఎలక్షన్స్ టైం లో రిలీజ్ అవడం కష్టమని.. ఫిబ్రవరి 22న మహానాయకుడు రిలీజ్ ఫిక్స్ చేశారు దర్శక నిర్మాతలు. క్రిష్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ పాత్రలో బాలకృష్ణ నటించారు. కచ్చితంగా కథానాయకుడు ఎఫెక్ట్ ఈ సినిమాపై ఉంటుంది. మరి ఈ సెకండ్ పార్ట్ అయినా అంచనాలను అందుకుంటుందా అన్నది వేచి చూడాలి.  Related Post

సినిమా స‌మీక్ష