నిహారికను ఏ కులం వాడికైనా చేస్తా..!

February 12, 2019


img

మెగా బ్రదర్ నాగబాబు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా కనిపిస్తున్నారు. నా ఛానెల్ నా ఇష్టం అంటూ ఓ యూట్యూబ్ ఛానెల్ పెట్టి తన అభిప్రాయాలను వెళ్లడిస్తున్న నాగబాబు కొన్ని సంచలన కామెంట్స్ కూడా చేస్తూ వచ్చాడు. ఇక ఈమధ్య ఓ ఇంటర్వ్యూలో నిహారికకు పెళ్లి చేసే ఆలోచనలో ఉన్నట్టు చెప్పుకొచ్చారు నాగబాబు. తను సినిమాల్లో నటిస్తా అన్నప్పుడు అందరం షాక్ అయ్యామని.. అయితే కేవలం తనకు 3 ఏళ్లు మాత్రమే టైం ఇచ్చానని అన్నారు నాగబాబు.

2018 వరకు తన సినిమా కోరిక తీర్చుకోమని చెప్పామని.. ఇక ఈ ఇయర్ ఎలాగైనా నిహారిక పెళ్లి చేస్తామని చెబుతున్నాడు నాగబాబు. అయితే తమని కాపు వరంగం కాబట్టి తన కులంలో ఎవరైనా సరైన అబ్బాయి దొరికితే పెళ్లి చేస్తానని.. లేకపోతే కులం తో సంబంధం లేకుండా ఏ కులం వాడికైనా ఇచ్చి తన కూతురు పెళ్లి చేస్తానని చెబుతున్నాడు నాగబాబు. అయితే అబ్బాయి మంచి వ్యక్తి, తన కాళ్ల మీద తను నిలబడగలిగితే చాలని అన్నారు. మొత్తానికి ఈ ఇయర్ మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి జరుగనుందన్నమాట. మరి నిహారిక పెళ్లి ఎవరితో జరుగుతుందో చూడాలి.Related Post

సినిమా స‌మీక్ష