వైఎస్ జ్ఞాపకాలను తట్టి లేపారు..!

February 12, 2019


img

శుక్రవారం రిలీజైన యాత్ర సినిమా ప్రేక్షకుల మనసులను గెలవడమే కాదు బాక్సాఫీస్ దగ్గర కూడా మంచి సందడి చేస్తుంది. మహి వి రాఘవ్ డైరక్షన్ లో వైఎస్సార్ బయోపిక్ గా వచ్చిన ఈ సినిమాను 70 ఎం.ఎం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో విజయ్ చిల్లా, శషి దేవిరెడ్డి నిర్మించారు. మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా వైఎస్ అభిమానులను బాగా ఆకట్టుకుంటుంది.  


మొదటి షో నుండి హిట్ టాక్ సొంతం చేసుకున్న యాత్ర సినిమాను వైఎస్ విజయమ్మ స్పెషల్ షో ద్వారా వీక్షించడం జరిగింది. సినిమా చూసిన విజయమ్మ వైఎస్ జ్ఞాపకాలను తట్టి లేపిన దర్శక నిర్మతలకు కృజ్ఞతలు తెలియచేశారు. వైఎస్సార్ మనముందు లేకున్నా ఈ సినిమా ఆయన్ను మన ముందుకు తెచ్చిందని అన్నారు. ప్రజలకు ఇచ్చిన మాట కోసం ప్రతి నిమిషం ఆలోచించే వారు రాజశేఖర్ రెడ్డి గారు.. ఆయన్ను ఆదరించినట్టుగా సినిమాను ఆదరిస్తున్నందుకు సంతోషంగా ఉందని అన్నారు విజయమ్మ.   Related Post

సినిమా స‌మీక్ష