యాత్ర డిజిటల్ రైట్స్ అదుర్స్..!

February 11, 2019


img

మహానేత వైఎస్సార్ జీవిత కథతో వచ్చిన యాత్ర సినిమా శుక్రవారం రిలీజ్ అయ్యింది. ప్రజలకు మేలు చేయాలన్న రాజన్న ఆలోచనలు ఆయన పాదయాత్ర టైం లో పొందిన అనుభూతులను అన్ని యాత్ర సినిమాలో చూపించారు. వైఎస్సార్ గా నటించిన మమ్ముట్టి పాత్రకు ప్రాణం పోశారు. సీనియర్ స్టార్ గా మరోసారి ఆయన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. మొదటి షో నుండి పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తున్న యాత్ర సినిమా వసూళ్లు కూడా బాగానే ఉన్నట్టు తెలుస్తుంది.

తొలి వారాంతరం లోనే సినిమా బిజినెస్ జరిగిన సగానికి వెనక్కి తెచ్చిందని మొదటి వారం లోనే సినిమా బ్రేక్ ఈవెన్ చేరుకోవడం ఖాయమని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఇక సినిమాకు టాక్ బాగుండటం వల్ల డిజిటల్ ఇంకా శాటిలైట్ రైట్స్ కూడా భారీగా పలుకుతున్నట్టు తెలుస్తుంది. డిజిటల్ రైట్స్ అమేజాన్ వారు 8 కోట్లకు కొన్నారని తెలుస్తుంది. బయోపిక్ సినిమాకు స్టార్ సినిమా రేంజ్ డిజిటల్ రైట్స్ రావడం విశేషంగా చెప్పుకోవచ్చు.

ఇక శాటిలైట్ రైట్స్ కూడా దాదాపు ఇదే రేంజ్ లో అమ్ముడవుతాయని తెలుస్తుంది. సో ఎలా లేదన్నా యాత్ర నిర్మాతలకు బిజినెస్ తో సంబంధం లేకుండా ఈ రైట్స్ రూపంలోనే మొత్తం బడ్జెట్ రికవరీ అయ్యేలా కనబడుతుంది. Related Post

సినిమా స‌మీక్ష