మెగా అల్లుడు మంచి మనసు..!

February 11, 2019


img

మెగా అల్లుడు అనగానే కళ్యాణ్ దేవ్, సాయి ధరం తేజ్ ఇద్దరిలో ఎవరన్న కన్ ఫ్యూజ్ రావడం కామనే. అయితే తేజూ గురించి చెప్పేటప్పుడు మెగా మేనళ్లుడు అనే వాడుతారు.. సో ఇక్కడ మెగా అల్లుడు అంటే కచ్చితంగా కళ్యాణ్ దేవ్. అతను చేసిన ఓ మంచి పని వల్ల అందరు అతన్ని ప్రశంసిస్తునారు. ఇంతకీ అతను ఏం చేశాడు అంటే అవయవ దానం చేసేందుకు డాక్యుమెంట్స్ పై సైన్ చేశాడు.


అవును ఇది నిజమే.. అపోలో హాస్పిటల్స్ వారి ఆధ్వర్యంలో కళ్యాణ్ దేవ్ ఆర్గాన్ డొనేషన్ కు సై అన్నాడు. అంతేకాదు ఈరోజే తన ట్విట్టర్ ఖాతా తెరచిన కళ్యాణ్ దేవ్ ఈ న్యూస్ నే తన మొదటి పోస్ట్ గా పెట్టాడు. దీనితో మెగా హీరో చేసిన పనికి మెగా ఫ్యాన్స్ అంతా సంతోషంగా ఉన్నారు. విజేత సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన కళ్యాణ్ దేవ్ ప్రస్తుతం తన రెండవ సినిమాకు కథనలు వింటున్నాడు. సరైన కథ కోసం వెయిట్ చేస్తున్నాడు కళ్యాణ్ దేవ్.Related Post

సినిమా స‌మీక్ష