రాజన్నను చూసినట్టే ఉంది.. యాత్రపై సైరా డైరక్టర్ కామెంట్స్..!

February 11, 2019


img

వైఎస్సార్ బయోపిక్ గా మహి వి రాఘవ్ డైరక్షన్ లో వచ్చిన సినిమా యాత్ర. 70 ఎం.ఎం ఎంటర్టైన్మెంట్స్ లో విజయ్ చిల్లా, శషి దేవిరెడ్డి నిర్మించిన ఈ సినిమా లాస్ట్ ఫ్రై డే రిలీజై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. వైఎస్ జీవితాన్ని చాలా అద్భుతంగా చూపించారని.. ముఖ్యంగా పాదయాత్రలో ఆయన పడిన కష్టం.. ఆయన తెలుసుకున్న విషయాల పట్ల దర్శకుడు మంచి ఆలోచనతో తీశాడని చెబుతున్నారు. ఇక ఈ సినిమా చూసిన డైరక్టర్ మారుతి, కోలీవుడ్ హీరో సూర్య ఇప్పటికే సినిమా గురించి పాజిటివ్ గా స్పందించగా.. సైరా నరసింహా రెడ్డి డైరక్టర్ సురేందర్ రెడ్డి యాత్ర సినిమా పై స్పందించడం జరిగింది.


యాత్ర చూశాను.. ఇదొక ఎమోషనల్ జర్నీ.. చాలా సందర్భాల్లో నేని ఎమోషనల్ అయ్యాను. మమ్ముట్టి గారి బ్రిలియెంట్ పర్ఫార్మెన్స్ కారణంతో తెరమీద రాజన్నను చూసినట్టే ఉందని.. అద్భుతమైన, గౌరవనీయమైన పని చేసినందుకు యాత్ర టీం కు అభినందనలు అంటూ సురేందర్ రెడ్డి ట్వీట్ చేశారు. అయితే రాజకీయాల కారణంగానే యాత్ర సినిమాపై సెలబ్రిటీస్ ఎవరు తమ స్పందించడం లేదని తెలుస్తుంది.     

 


Related Post

సినిమా స‌మీక్ష