రియల్ సూపర్ స్టార్ మహేష్..!

February 11, 2019


img

సూపర్ స్టార్ మహేష్, నమ్రత ఈరోజు తమ 14వ మ్యారేజ్ యానివర్సరీ జరుపుకున్నారు. పెళ్లి రోజు పెద్ద పార్టీ ఇచ్చి తమ ఆనందాన్ని ఇతరులతో పంచుకోవచ్చు. అయితే దాని కన్నా ముందు తమ మంచి మనసు చాటేలా దేవ్ నగర్ లోని అంధ పిల్లలకు భోజనాన్ని ఏర్పాటు చేశారు. లాస్ట్ ఇయర్ కూడా తమ పెళ్లి రోజు 600 మందికి దేవ్ నగర్ అంధ పిల్లలకు లంచ్ ఏర్పాటు చేయగా ఈ ఇయర్ 650 మందికి లంచ్ ప్రొవైడ్ చేశారట.

అంధులైన పిల్లలు ఒకపూట కడుపునిండా భోజనం చేసేందుకు మహేష్ ప్లాన్ చేయడం నిజంగా గొప్ప విషయం. అంతేకాదు దేవ్ నగర్ స్కూల్ కు తన సపోర్ట్ అన్నివేళలా ఉంటుందని చెప్పాడట మహేష్. మహేష్ చేసిన ఈ మంచి పనికి అతన్ని రియల్ సూపర్ స్టార్ అని పొగిడేస్తున్నారు. ప్రస్తుతం మహేష్ మహర్షి సినిమా చేస్తున్నాడు. వంశీ పైడిపల్లి డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా మహేష్ కెరియర్ లో 25వ సినిమాగా రాబోతుంది. Related Post

సినిమా స‌మీక్ష