ఆర్.ఆర్.ఆర్ లో మరో క్రేజీ స్టార్..!

February 11, 2019


img

బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న క్రేజీ మల్టీస్టారర్ మూవీ ఆర్.ఆర్.ఆర్. ఎన్.టి.ఆర్, రాం చరణ్ కలిసి చేస్తున్న ఈ మెగా మల్టీస్టారర్ సినిమాపై అంచనాలు భారీ రేంజ్ లో ఉన్నాయి. దానయ్య డివివి నిర్మాణంలో దాదాపుగా 300 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈమధ్యనే సెకండ్ షెడ్యూల్ మొదలు పెట్టిన ఈ సినిమా హీరోయిన్స్ ఎవరన్నది ఇంకా ఫైనల్ కాలేదు. ఇదిలాఉంటే ఈ సినిమాలో ప్రతినాయకుడి రోల్ లో బాలీవుడ్ స్టార్ నటిస్తాడని అంటున్నారు.   

అసలైతే రాజమౌళి ఈ ఆర్.ఆర్.ఆర్ సినిమాలో అజయ్ దేవగన్ ను తీసుకోవాలని అనుకున్నారట. మరి ఆయన కాదన్నాడో ఏమో కాని ఇప్పుడు ట్రిపుల్ ఆర్ లో అక్షయ్ కుమార్ ఉంటున్నాడని వార్తలు మొదలయ్యాయి. ఇప్పటికే 2.ఓలో విలన్ గా మెప్పించిన అక్షయ్ కుమార్ ఆర్.ఆర్.ఆర్ లో విలన్ గా అంటే ఈ ప్రాజెక్ట్ కు మరింత క్రేజ్ వచ్చినట్టే. ఈ సినిమా షూటింగ్ టైంలో సెల్ ఫోన్స్ వాడకుండా ఉండాలని నిబంధనలు పెట్టినా సినిమాకు సంబందించిన సెట్స్ లీక్ అవుతూనే ఉన్నాయి. లేటెస్ట్ గా రాం చరణ్ పాత్ర పేరు రామరాజు అని బయటకు వచ్చింది.   Related Post

సినిమా స‌మీక్ష