RRR సెట్ లీక్.. రాజమౌళి అప్సెట్..!

February 09, 2019


img

రాజమౌళి దర్శకత్వంలో బాహుబలి తర్వాత వస్తున్న సినిమా ఆర్.ఆర్.ఆర్. ఎన్.టి.ఆర్, రాం చరణ్ కలిసి చేస్తున్న ఈ మల్టీస్టారర్ మూవీ ప్రస్తుతం సెకండ్ షెడ్యూల్ జరుపుకుంటుంది. బాహుబలిలానే ఈ ఆర్.ఆర్.ఆర్ సినిమా కోసం రాజమౌళి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నా సరే లీకులు ఆగట్లేదు. సినిమా నుండి లేటెస్ట్ గా ఓ పోలీస్ స్టేషన్ సెట్ లీక్ అయ్యింది. 

రాజమౌళికి ఈ లీకులు షాక్ ఇస్తున్నాయి. ఎంత సీక్రెట్ గా ఉంచుదామని అనుకున్నా సరే ఎవరో ఒకరు సినిమాకు సంబందించిన పిక్స్ లీక్ చేస్తున్నారు. లేటెస్ట్ గా లీకైన పిక్ స్వాతంత్రం రాకముందు పోలీస్ స్టేషన్ సెట్ అని తెలుస్తుంది. దీనితో సినిమా కథ మీడియాలో లీక్ అయినట్టుగా చరణ్ పోలీస్.. ఎన్.టి.ఆర్ బందిపోటు దొంగగా నటించడం కన్ ఫాం అన్నమాట. ఇక ఈ సినిమా లీకుల మీద సీరియస్ గా ఉన్న రాజమౌళి ఇక మీదట ఇలాంటివి జరుగకుండా ఉండేలా ఇంకా స్ట్రిక్ట్ రూల్స్ పాటించాలని నిర్ణయించుకున్నాడు.



Related Post

సినిమా స‌మీక్ష