యాత్ర : రివ్యూ

February 08, 2019


img

రేటింగ్ : 3.5/5 

కథ :

దివంగత నేత వైఎస్సార్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన సినిమా ఈ యాత్ర. అసలు ఏమాత్రం గెలుపు అవకాశం లేని 2004 ఎన్నికల ముందు వైఎస్సార్ చేసిన పాదయాత్ర ఎలా వైఎస్సార్ ను సిఎం అయ్యేలా చేసింది. పాదయాత్రలో ఆయన పొందిన అనుభూతులు.. ప్రజల కష్టాలు తీర్చేందుకు ఆయన తీసుకున్న నిర్ణయాలు ఇలా అన్ని విషయాలు ఈ యాత్రలో ప్రస్తావించడం జరిగింది.

విశ్లేషణ :

జననేతగా ప్రజల కష్టాలను తెలుసుకునేందుకు వారి మధ్యలోకి వెళ్లిన వైఎస్సార్ పాదయాత్రలో ఆయన పొందిన అనుభూతిని చాలా ఎమోషనల్ గా చూపించారు. అంతేకాదు ఆవేశపరుడని వినిపించే వైఎస్సార్ ప్రజల కోసం ఎలా మారిపోయాడు. హై కమాండ్ చెప్పిన మాట కన్నా తన మాటే శాసనంగా ప్రజలకు మేలు చేసే ఎన్నో ఆలోచనలు ఎలా మొదలయాయి అన్నది బాగా చూపించారు.

ముఖ్యంగా వైఎస్ ప్రవేశ పెట్టిన ఆరోగ్యశ్రీ, ఫీజ్ రీ ఎంబర్స్మెంట్ లాంటి పథకాలను ప్రవేశపెట్టేందుకు ఆయన పొందిన అనుభవాలను  చూపించారు. సినిమా అంతా వైఎస్ వ్యక్తిత్వం.. ప్రజల పట్ల ఆయనకున్న ప్రేమని చూపించారు. సినిమా మొత్తం ఎమోషనల్ జర్నీగా సాగించాడు దర్శకుడు మహి వి రాఘవ్. క్లైమాక్స్ లో రియల్ ఫీడ్ తో వైఎస్ అభిమానుల హృదయాలను బరువెక్కేలా చేశారు. వైఎస్సార్ గా మమ్ముట్టి అభినయం సినిమాకే హైలెట్ అని చెప్పొచ్చు. 

నటన, సాంకేతిక వర్గం :

వైఎస్సార్ గా చేసిన మమ్ముట్టి తన నటనా ప్రతిభతో ఆకట్టుకున్నారు. కనిపించేది మమ్ముట్టి అయినా ఆయనలో వైఎస్ ను చూసుకునేలా చేశాడు. కెవిపిగా రావు రమేష్ మెప్పించారు. మిగతా పాత్రలన్ని పరిధి మేరకు నటించి మెప్పించారు.

ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే.. సత్య సూర్యన్ సినిమాటోగ్రఫీ బాగుంది. కె మ్యూజిక్ మెప్పించింది. బిజిఎం, సాంగ్స్ అన్ని అలరించాయి. మహి వి రాఘవ్ ముందునుండి చెబుతున్నట్టుగానే వైఎస్ మీద ఉన్న అభిమానంతో ఆ మహానేత చరిత్రను అందంగా తెరకెక్కించాడు. దర్శకుడిగా మహికి నూటికి నూరు మార్కులు పడినట్టే. ఇక సినిమా నిర్మాతలు విజయ్ చిల్లా, శషి దేవిరెడ్డి ఎక్కడ కాంప్రమైజ్ అవకుండా సినిమాను తెరకెక్కించారు. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.

ఒక్కమాటలో :

వైఎస్ రాజశేఖర్ రెడ్డికి గొప్ప నివాళి ఈ 'యాత్ర'..!


Related Post

సినిమా స‌మీక్ష