విలన్ గా ఆరెక్స్ హీరో..!

February 07, 2019


img

ఆరెక్స్ 100 సినిమాతో సూపర్ హిట్ అందుకున్న కార్తికేయ తన మొదటి సినిమా ఎవరికి తెలియకపోయినా రెండో ప్రయత్నంగా చేసిన ఆరెక్స్ 100తో మాత్రం అదరగొట్టాడు. సినిమాలో కార్తికేయ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ తో చేసిన రొమాన్స్ యూత్ ఆడియెన్స్ కు తెగ నచ్చేసింది. ఇక ఆ సినిమా ఇచ్చిన జోష్ తో వరుస సినిమాలు చేస్తున్నాడు కార్తికేయ. ప్రస్తుతం తమిళ అగ్ర నిర్మాత కళైపులి ఎస్ థాను నిర్మాణంలో తెలుగు, తమిళ భాషల్లో ఓ బైలింగ్వల్ మూవీ చేస్తున్నాడు కార్తికేయ.

ఆ సినిమా తర్వాత నాని సినిమాలో విలన్ గా కూడా ఓకే చెప్పినట్టు టాక్. నాచురల్ స్టార్ నాని, విక్రం కుమార్ డైరక్షన్ లో సినిమా రాబోతుంది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమాలో నానికి విలన్ గా ఆరెక్స్ 100 హీరో కార్తికేయ నటిస్తున్నాడని తెలుస్తుంది. ఇప్పటికే ఆ సినిమాకు కార్తికేయ డేట్స్ అడ్జెస్ట్ చేశాడట. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్, మేఘా ఆకాష్, ప్రియా ప్రకాశ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమా నాని కెరియర్ లో హయ్యెస్ట్ గా 50 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతుందని తెలుస్తుంది.   Related Post

సినిమా స‌మీక్ష