తమిళ అర్జున్ రెడ్డిని ఆపేస్తున్నారు..!

February 07, 2019


img

విజయ్ దేవరకొండ నటించిన సెన్సేషనల్ మూవీ అర్జున్ రెడ్డి సినిమా తమిళంలో వర్మగా రీమేక్ అవుతుంది. చియాన్ విక్రం తనయుడు ధ్రువ్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. సీనియర్ డైరక్టర్ బాలా డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ఈమధ్యనే సినిమా టీజర్, ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. అయితే సినిమా ఫస్ట్ కాపీ చూశాక సినిమా అనుకున్న విధంగా రాలేదని సినిమాను మళ్లీ రీషూట్ చేయదలచారట.

ఒకటి రెండు షూట్స్ కాదు ఏకంగా సినిమా మొత్తం రీషూట్ చేయాలని నిర్ణయించుకున్నారట. ధ్రువ్ హీరోగా చేస్తాడట కాని మిగతా కాస్ట్ అండ్ క్రూ మొత్తం మారుస్తున్నారట. తమిళ నిర్మాతలు ఈ4 ఎంటర్టైన్మెంట్స్ వారు అఫిషియల్ ప్రకటనగా ఈ విషయాన్ని వెళ్లడించారు. ఓ సినిమా పూర్తయ్యాక ఆ సినిమా మళ్లీ రీషూట్ చేయాలని అనుకోవడం చాలా అరుదు. బాలా లాంటి డైరక్టర్ కు ఇది చాలా అవమానమని చెప్పొచ్చు.   Related Post

సినిమా స‌మీక్ష