మహేష్ కన్నుల్లో పడ్డాడుగా..!

February 07, 2019


img

హీరోగా సూపర్ ఫాంలో ఉన్న మహేష్ బాబు కొత్తగా నిర్మాణ రంగంలోకి అడుగు పెడుతున్నాడు. ఎం.బి ప్రొడక్షన్స్ లో తన సినిమాలకు సహ నిర్మాతగా ఉంటూ వస్తున్న మహేష్ ఇప్పుడు డైరెక్ట్ గా సినిమా నిర్మాణానికి సై అంటున్నాడు. దానికంటే ముందు ఓ వెబ్ సీరీస్ ప్లానింగ్ లో ఉన్న మహేష్ యువ హీరోతో ఓ సినిమా చేయబోతున్నాడని తెలుస్తుంది.

మహేష్ కన్నుల్లో పడ్డ ఆ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ఎవరు అంటే అడివి శేష్ అని తెలుస్తుంది. సొంత టాలెంట్ తో పైకి వస్తున్న అడివి శేష్ లాస్ట్ ఇయర్ వచ్చిన గూఢచారి సినిమాతో సత్తా చాటాడు. ప్రస్తుతం గూఢచారి-2, 2 స్టేట్స్ సినిమా చేస్తున్న అడివి శేష్ మహేష్ నిర్మాతగా వ్యవహరిస్తున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడట. ఈ సినిమాకు దర్శకుడు ఎవరు సినిమా జానర్ ఏంటి అన్నది తెలియాల్సి ఉంది. మహేష్ చేస్తున్న వెబ్ సీరీస్ మాత్రం చార్లి టైటిల్ తో వస్తుంది. ఈ వెబ్ సీరీస్ ను హుస్సెన్ షా కిరణ్ డైరెక్ట్ చేస్తారని తెలుస్తుంది.Related Post

సినిమా స‌మీక్ష