లవర్స్ డే టీజర్.. ప్రియా ప్రకాశ్ మళ్లీ అదరగొట్టింది..!

February 07, 2019


img

మళయాళ మూవీ ఒరు ఆదార్ లవ్ సినిమా టీజర్ సెన్సేషన్స్ తెలిసిందే. భాషతో సంబంధం లేకుండా ఆ టీజర్ అంతటా సంచలనం సృష్టించింది. ఇక అందులో ప్రియా కనుసైగలకు యూత్ ఆడియెన్స్ ఫిదా అయ్యారు. ఇక ఆ సినిమాకు వచ్చిన క్రేజ్ చూసి తెలుగులో దాన్ని రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. ఈ సినిమా తెలుగులో లవర్స్ డే టైటిల్ తో రిలీజ్ అవుతుంది. ఈమధ్యనే ఈ సినిమా ఆడియో రిలీజ్ ఈవెంట్ కు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అతిథిగా వచ్చారు.

ఫిబ్రవరి 14న రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమా నుండి ఓ టీజర్ రిలీజైంది. ఈ టీజర్ లో హీరో రోషన్ అబ్ధుల్ ప్రియా ప్రకాశ్ అదరచుంభనం అదరగొట్టాడు. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాలో యూత్ ఆడియెన్స్ కు కావాల్సిన అంశాలు పుష్కలంగా ఉన్నాయని తెలుస్తుంది. అయితే టీజర్ లో హీరో, హీరోయిన్ కు చెప్పిన డబ్బింగ్ మాత్రం పెద్దగా మెప్పించలేదు. మరి టీజర్ తో సెన్సేషన్స్ క్రియేట్ చేసిన లవర్స్ డే సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

Related Post

సినిమా స‌మీక్ష