హైదరాబాద్ వస్తున్న మహేష్ మైనపు బొమ్మ..!

February 07, 2019


img

టాలీవుడ్ సెలబ్రిటీస్ మేడం టుసాడ్స్ మ్యూజియంలో మైనపు బొమ్మలు ఆనవాయితి కొనసాగుతుంది. తెలుగు పరిశ్రమ నుండి మొదట ప్రభాస్ కు ఈ ఛాన్స్ రాగా ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ ఈ క్రేజ్ దక్కించుకున్నాడు. ఈమధ్యనే సింగపూర్ మేడం టుస్సాడ్స్ మ్యూజియం లో మహేష్ మైనపు బొమ్మ ఉంచారు. అయితే ఇది హైదరాబాద్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.  

ఏంటి మ్యూజియంలో ఉండాల్సిన మహేష్ స్టాట్యూ హైదరాబాద్ కు ఎందుకు అంటే.. మహేష్ మొదలుపెట్టిన ఏ.ఎం.బి సినిమాస్ లో ఒకరోజు ప్రదర్శనగా ఈ స్టాట్యూ ఉంచనున్నారట. మహేష్ విత్ మహేష్ స్టాట్యూ కూడా ప్రేక్షకులను అలరించనుంది. అయితే అత్యంత సున్నితమైన ఈ మైనపు బొమ్మని హైదరాబాద్ కు చేర్చేందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారట. ప్రముఖ లాగిస్టిక్ కంపెనీ ఈ స్టాట్యూ ట్రాన్స్ పోర్ట్ చేస్తుందట. మరి మహేష్ మైనపు బొమ్మని ప్రత్యక్షంగా చూడాలనుకునే వారు ఏ.ఎం.బి సినిమాస్ కు వారు చెప్పిన డేట్ కు వెళ్తే సరిపోతుంది. Related Post

సినిమా స‌మీక్ష