తమిళ దర్శకుడితో అఖిల్..?

February 06, 2019


img

అక్కినేని అఖిల్ రీసెంట్ మూవీ మిస్టర్ మజ్ను కూడా నిరాశపరచడంతో ఆడియెన్స్ కన్నా అఖిల్ ఇంకా ఎక్కువ నిరుత్సాహంలో ఉన్నాడని తెలుస్తుంది. సినిమా కోసం రెండు రాష్ట్రాల్లో సక్సెస్ టూర్ ప్లాన్ చేసినా అది కలక్షన్స్ మీద ప్రభావితం చూపించలేదు. ఇక ప్రస్తుతం తన తర్వాత సినిమా ఎవరితో చేయాలి అన్న సందిగ్ధంలో ఉన్నాడు అఖిల్. హలో టైంలో సత్య ప్రభాస్ ఓ స్టోరీ నరేట్ చేశాడట.  

హలో చేయడం వల్ల అది వెనక్కి వెళ్లింది. ఇక తర్వాత వెంకీతో సినిమా చేశాడు. ఆది పినిశెట్టి తనయుడైన దర్శకుడు సత్య ప్రభాస్ అఖిల్ కోసం ఓ క్రేజీ స్టోరీ రాశాడట. ఇప్పుడు అఖిల్ చూపు ఆ దర్శకుడి మీద పడ్డది. ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసుకుని వస్తే దాన్ని చూసి సినిమా కమిట్ అవుదామని చూస్తున్నాడట అఖిల్. మరోపక్క అఖిల్ బాక్సాఫీస్ సక్సెస్ పై నాగార్జునకు టెన్షన్ పట్టుకుంది. 3 సినిమాలు ఫెయిల్ అవడంపై నాగ్ ఆందోళన చెందుతున్నాడని తెలుస్తుంది. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే అఖిల్ ఎంచుకున్న కథలు, సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి తప్ప సినిమాలో అఖిల్ కు మంచి మార్కులే పడుతున్నాయి. సో నాగార్జున అంత దిగులు పడాల్సిన అవసరం లేదని కొందరు సలహా ఇస్తున్నారు.Related Post

సినిమా స‌మీక్ష