ఆరెక్స్ డైరక్టర్ 'మహా సముద్రం'

February 06, 2019


img

ఆరెక్స్ 100 సినిమాతో సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు అజయ్ భూపతి అతని డైరక్షన్ లో రెండో సినిమా త్వరలో సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నాడు. ఈ సినిమాలో హీరోగా ముందు రామ్ అనుకోగా అతని ప్లేస్ లో బెల్లంకొండ శ్రీనివాస్ వచ్చి చేరాడు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసిన ఈ సినిమాలో హీరోయిన్ గా సమంత నటిస్తుందని తెలుస్తుంది. బెల్లంకొండ శ్రీనివాస్ మొదటి సినిమా అల్లుడు శీనులో సమంత హీరోయిన్ గా నటించింది. ఇక ఇప్పుడు అతనితో మరోసారి జత కట్టేందుకు సిద్ధమైంది సమంత.    

ఇక ఈ సినిమాకు టైటిల్ గా మహా సముద్రం అని పెట్టబోతున్నారట. ఆరెక్స్ 100 ఓ ఫెయిల్యూర్ లవర్ కథను తీసుకున్న అజయ్ భూపతి ఈసారి మాఫియా బ్యాక్ డ్రాప్ తో మహా సముద్రం సినిమా చేస్తున్నాడని తెలుస్తుంది. మొదటి సినిమా అల్లు శీను నుండి లాస్ట్ ఇయర్ వచ్చిన సాక్ష్యం వరకు బెల్లంకొండ శ్రీనివాస్ భారీ బడ్జెట్ సినిమాలు చేస్తున్నా ఇంతవరకు సక్సెస్ మాత్రం అందుకోలేదు. ప్రస్తుతం తేజ డైరక్షన్ లో సీత సినిమా చేస్తున్న శ్రీనివాస్ త్వరలోనే అజయ్ భూపతి సినిమా స్టార్ట్ చేయనున్నాడు.     Related Post

సినిమా స‌మీక్ష