బుల్లితెర ఝాన్సి ఆత్మహత్య..!

February 06, 2019


img

 బుల్లితెర మీద సీరియల్స్ లో నటిస్తూ అలరిస్తున్న ఝాన్సి శ్రీనగర్ కాలనీలో ఆత్మ హత్య చేసుకుంది. స్టార్ మాలో టెలికాస్ట్ అవుతున్న పవిత్ర బంధం సీరియల్ లో నటిస్తున్న ఝాన్సి ప్రేమ వ్యవహారమే ఆమెను ఆత్మహత్య చేసుకునేలా చేసిందని అంటున్నారు. కృష్ణా జిల్లా ముదినేపల్లి నుండి వచ్చిన ఝాన్సి పలు సీరియల్స్ లో నటిస్తున్నారు.   

  

ఝాన్సి మరణ వార్త అటు స్మాల్ స్క్రీన్, ఇటు సిల్వర్ స్క్రీన్ అందరికి షాక్ ఇచ్చింది. ఇప్పుడిప్పుడే కెరియర్ లో ఎదుగుతున్న ఝాన్సి ఇంత ఘోరానికి పాల్పడుతుందని ఎవరు ఊహించలేదని అంటున్నారు కుటుంబ సభ్యులు. సూర్య అనే వ్యక్తిని ప్రేమిస్తున్న ఝాన్సి అతన్ని పెళ్లి చేసుకోమని అడిగిందట. కొన్నాళ్లు సహజీవనం చేసిన అతను ఆమెతో పెళ్లికి నిరాకరించాడని తెలుస్తుంది. ఝాన్సి ఆత్మహత్య వెనుక కారణం కేవలం ప్రేమ వ్యవహారమేనా లేక వేరే ఏమైనా కారణాలు ఉన్నాయా అన్నది తెలియాల్సి ఉంది. విషయం పోలీసులకు తెలియడంతో ఝాన్సి కేసు విచారణ మొదలు పెట్టారు.                 


Related Post

సినిమా స‌మీక్ష