నా అకౌంట్ హ్యాక్ అయ్యింది..!

February 05, 2019


img

ఈమధ్య హీరోయిన్స్ ట్విట్టర్, ఇన్ స్టాగ్రాం ఎకౌంట్స్ హ్యాక్ అయినట్టుగా వార్తలు వినపడుతూనే ఉన్నాయి. ఈమధ్యనే త్రిష తన ఇన్ స్టాగ్రాం ఎకౌంట్ హ్యాక్ అయ్యిందని చెప్పి రికవర్ చేసుకుంది. ఇక లేటెస్ట్ గా మరో హీరోయిన్ ఇన్ స్టా ఎకౌంట్ హ్యాక్ అయినట్టుగా ఆమె ట్విట్టర్ ద్వారా వెళ్లడించింది. తెలుగు, తమిళ భాషల్లో హీరోయిన్ గా సినిమాలు చేస్తున్న మేఘా ఆకాష్ ఇన్ స్టాగ్రాం ఎకౌంట్ హ్యాక్ అయినట్టు తెలిపింది. 

అయితే తన టీం రికవరీ కోసం ప్రయత్నిస్తుందని.. అభిమానులు ఎవరు ఆ ఎకౌంట్ నుండి వచ్చే మెసేజులకు రెస్పాండ్ అవొద్దని అన్నది. ఎకౌంట్ రికవర్ అయిన తర్వాత తాను వెళ్లడిస్తానని చెప్పుకొచ్చింది. తెలుగులో లై, ఛల్ మోహన్ రంగ సినిమాలు చేసినా హిట్ అందుకోని మేఘా ఆకాష్ నాని, విక్రం కుమార్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో సెలెక్ట్ అయ్యిందని తెలుస్తుంది.               Related Post

సినిమా స‌మీక్ష