మిస్టర్ మజ్ను రివ్యూ & రేటింగ్

January 25, 2019


img

రేటింగ్ : 3/5

కథ :

విక్రం కృష్ణ (అఖిల్) సరదాగా జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ప్లే బోయ్ అయిన విక్కి కన్ను కొట్టాడంటే అమ్మాయి పడినట్టే.. ఇక అలాంటి విక్కికి నిక్కి (నిధి అగర్వాల్) పరిచయం అవుతుంది. విక్కి గురించి అంతా తెలిసినా అతనికి దగ్గరవుతుంది నిక్కి. విక్కిని ప్రేమిస్తుంది. అయితే తన ప్రేమను ముందు ఒప్పుకున్న విక్కి ఆమె చేసే పనుల వల్ల విసిగిపోతాడు. ఒకదశలో ఆమెతో పెళ్లికి విక్కి, నిక్కి ఫ్యామిలీలు ఒప్పుకున్నా విక్కి మాత్రం వద్దని చెప్పాలని భావిస్తాడు. అయితే విక్కి మనసులో మాట తెలుసుకున్న నిక్కి విక్కిని వదిలి దూరంగా వెళ్తుంది. అయితే ఆమె వెళ్లాక నిక్కి విలువ తెలుసుకున్న విక్కి ఆమెను వెతుక్కుంటూ వెళ్తాడు.. అలా వెళ్లిన విక్కి నిక్కిని ఎలా దక్కించుకున్నాడు అన్నది సినిమా కథ.

విశ్లేషణ :

ప్రేమకథలు ఎన్నొచ్చినా సరే మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది. అదీగాక తొలిప్రేమ సినిమాతో హిట్ అందుకున్న వెంకీ అట్లూరి మరోసారి అలాంటి కథతోనే వచ్చాడు. అయితే మిస్టర్ మజ్ను సినిమా మరీ రొటీన్ గా అనిపిస్తుంది. స్క్రీన్ ప్లే కొద్దిగా మేనేజ్ చేసినా కథ విషయంలో అతనిక్ మైనస్ మార్కులు పడ్డాయి.

ఇక ఈ సినిమా కథనం విషయానికొస్తే మొదటి భాగం బాగానే మెప్పించిన దర్శకుడు సెకండ్ హాఫ్ మరీ రొటీన్ గా నడిపించాడు. ఫస్ట్ హాఫ్ లో ఉన్న లవ్, ఎమోషన్ సెకండ్ హాఫ్ లో మిస్సైంది. అన్ని తెలిసిన సీన్స్ వస్తున్నాయనిపిస్తుంది. హీరో హీరోయిన్ పెయిర్ బాగుంది. వారి మధ్య కెమిస్ట్రీ బాగానే వర్క్ అవుట్ అయ్యింది.

అయితే దర్శకుడు సెకండ్ హాఫ్ ఇంకాత గ్రిప్పింగ్ గా రాసుకుని ఉంటే బాగుండేది. ఫైనల్ గా అఖిల్, హలో సినిమాల కన్నా మిస్టర్ మజ్ ను అఖిల్ మెప్పించడని చెప్పొచ్చు. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా యువత మెప్పు పొందే అవకాశం ఉంది.

నటన, సాంకేతికవర్గం :

అఖిల్ ప్లే బోయ్ పాత్రలో అదరగొట్టాడు. ఇంకా ఎమోషనల్ సీన్స్ లో కూడా బాగా చేశాడు. నిధి అగర్వాల్ నటన బాగుంది. సినిమాలో ఆమెకు మంచి స్కోప్ దొరికింది. రావు రమేష్, జయ ప్రకాశ్, నాగబాబు పాత్రలు అంత పెద్ద ప్రాముఖ్యత లేవిగా ఉన్నాయి. ప్రియదర్శి, ఆది కామెడీ సోసోగానే ఉంది. మిగతా పాత్రలన్ని పరిధి మేరకు నటించి మెప్పించారు.

ఇక టెక్నికల్ టీం విషయానికొస్తే.. జార్జ్ సి విలియమ్స్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఫారిన్ లొకేషన్స్ చాలా అందంగా చూపించారు. లీడ్ పెయిర్ ను అందంగా చూపించారు. తమన్ మ్యూజిక్ సినిమాకు ప్లస్ అయ్యింది. బిజిఎంలో తమన్ మరోసారి తన మార్క్ చూపించాడు. కథ రొటీన్ గా అనిపించినా కథనంలో దర్శకుడి ప్రతిభ కనిపించింది. అయితే ఇంకాస్త జాగ్రత్త పడి ఉంటే బాగుండేది. బోగవల్లి ప్రసాద్ ప్రొడక్షన్ వాల్యూస్ ఆకట్టుకున్నాయి.

ఒక్కమాటలో :

అఖిల్ మిస్టర్ మజ్ను.. టెస్టులో పాస్ అయినట్టే..! 



Related Post

సినిమా స‌మీక్ష