ఎన్.టి.ఆర్ పాత్రలో రంగస్థల నటుడు

January 19, 2019


img

సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ డైరక్షన్ లో వస్తున్న లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ సినిమాలో ఎన్.టి.ఆర్ ఫస్ట్ లుక్ శుక్రవారం ఎన్.టి.ఆర్ వర్ధంతి సందర్భంగా రిలీజ్ చేశారు. అచ్చం ఎన్.టి.ఆర్ ను పోలినట్టుగానే ఉన్న ఈ ఆన్ స్క్రీన్ ఎన్.టి.ఆర్ అదరగొట్టాడని చెప్పాలి. ఈ ఫస్ట్ లుక్ వీడియో తక్కువ టైంలో మిలియన్ మార్క్ వ్యూస్ అందుకుంది అంటే ఎన్.టి.ఆర్ లుక్ లో అతను సూపర్ హిట్ అయ్యాడని చెప్పొచ్చు. 

ఇంతకీ ఎన్.టి.ఆర్ పాత్రలో కనిపించిన అతనెవరు అన్నది తెలుసుకోవాలని అందరు వెతకడం మొదలు పెట్టారు. ఇలాంటిదేదో ముందే ఊహించిన ఆర్జివి అతని గురించి కొన్ని డీటైల్స్ ఇచ్చాడు. అతనో థియేటర్ ఆర్టిస్ట్ అని.. వెస్ట్ గోదావరికి చెందిన వ్యక్తి అని వర్మ ట్వీట్ చేశాడు. అతని వాయిస్, ఎక్స్ ప్రెషన్స్ విషయమై కొన్నాళ్లు ట్రైనింగ్ కూడా ఇచ్చారట. ఫైనల్ కాస్టింగ్ విషయంలో ఆర్జివి ఎంత పర్ఫెక్ట్ గా ఉంటాడో లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ లో ఎన్.టి.ఆర్ ను చూశాక మరోసారి ప్రూవ్ అయ్యింది. మరి అనుకున్న విధంగా సినిమాపై అటెన్షన్ వచ్చేలా చేసుకున్న ఆర్జివి సినిమాను ఏం చేస్తాడో చూడాలి.  Related Post

సినిమా స‌మీక్ష