క్రైమ్ థ్రిల్లర్ సినిమాలో మహేష్..!

January 19, 2019


img

మహర్షి సినిమా తర్వాత సూపర్ స్టార్ మహేష్ సుకుమార్ డైరక్షన్ లో సినిమా చేస్తాడని తెలుస్తుంది. అయితే సుకుమార్ సినిమాకు స్క్రిప్ట్ ఇంకా ఫైనలా కాలేదని అంటున్నారు. అయితే ఈ సినిమా గ్యాప్ లో అర్జున్ రెడ్డి డైరక్టర్ సందీప్ వంగతో మహేష్ సినిమా ఉంటుందని చెబుతున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఈ సినిమా ఉంటుందట. మహర్షి తర్వాత సందీప్ వంగ డైరక్షన్ లోనే సినిమా ఉంటుందని ఫిల్మ్ నగర్ టాక్.

ఇక ఈ సినిమా కథ కూడా క్రైమ్ డ్రామాగా ఉంటుందట. మహేష్ ఇంతవరకు ఇలాంటి కాన్సెప్ట్ మూవీ చేయలేదు. సందీప్ వంగ మహేష్ ఇమేజ్ కు తగినట్టుగా ఈ సినిమా కథ రాసుకున్నాడట. అర్జున్ రెడ్డి సినిమాతో సత్తా చాటిన సందీప్ వంగ ప్రస్తుతం హిందిలో ఆ సినిమా రీమేక్ చేస్తున్నాడు. అక్కడ కబీర్ సింగ్ గా వస్తున్న ఈ మూవీలో షాహిద్ కపూర్, కియరా అద్వాని లీడ్ రోల్స్ చేస్తున్నారు. మరి సందీప్ తో మహేష్ సినిమా ఎలా ఉండబోతుందో తెలియాలంటే మరికొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే. Related Post

సినిమా స‌మీక్ష