ఎఫ్-2 డైరక్టర్ రెమ్యునరేషన్ పెంచాడట

January 19, 2019


img

ఈ సంక్రాంతికి అసలు సిసలు సూపర్ హిట్ అందుకున్న సినిమాగా ఎఫ్-2 అశేష ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంటుంది. పోటీలో ఏమాత్రం అంచనాలు లేని ఎఫ్-2 సంక్రాంతి విన్నర్ గా విజయ పతాకం ఎగురవేసింది. విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోగా నటించిన ఈ సినిమాను దిల్ రాజు నిర్మించగా అనీల్ రావిపుడి డైరెక్ట్ చేశారు. పటాస్ నుండి ఎఫ్-2 వరకు వరుస విజయాలతో దూసుకెళ్తున్న అనీల్ రావిపుడి ఈ హిట్ తో తన రెమ్యునరేషన్ కూడా పెంచాడని తెలుస్తుంది. 

మొన్నటిదాకా సినిమాకు మూడు కోట్లు మాత్రమే రెమ్యునరేషన్ గా తీసుకునే అనీల్ రావిపుడి ఎఫ్-2 హిట్ తో 5 కోట్లు చేశాడట. అనీల్ రావిపుడి చేసిన నాలుగు సినిమాల్లో మూడు సినిమాలు దిల్ రాజు నిర్మాణంలో వచ్చాయి. తన తర్వాత సినిమా కూడా దిల్ రాజు బ్యానర్ లోనే ఉంటుందని తెలుస్తుంది. అనీల్ రావిపుడి తన సక్సెస్ మేనియా ఇలానే కొనసాగించి ప్రేక్షకులకు నవ్వుల పండుగ చేసుకునేలా చేయాలని ఆశిద్దాం.  Related Post

సినిమా స‌మీక్ష