కమల్, వెంకటేష్ మల్టీస్టారర్.. జరిగే పనేనా..!

January 19, 2019


img

బ్రహ్మోత్సవం డైరక్టర్ శ్రీకాంత్ అడ్డాల గీతా ఆర్ట్స్ బ్యానర్ లో సినిమా చేస్తాడని తెలుస్తుంది. కథ ఓకే అయినా హీరో కోసమే వేట మొదలు పెట్టారట. ఇక ఈ సినిమాతో పాటుగా వెంకటేష్, కమల్ హాసన్ తో ఓ భారీ మల్టీస్టారర్ కథ రాసుకున్నాడట శ్రీకాంత్ అడ్డాల. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా తెచ్చిన పేరుని బ్రహ్మోత్సవంతో పోగొట్టుకున్నాడు శ్రీకాంత్ అడ్డాల. ఆ సినిమా తర్వాత గ్యాప్ తీసుకున్న ఈ డైరక్టర్ త్వరలోనే సినిమా ఎనౌన్స్ మెంట్ తో వస్తాడని తెలుస్తుంది. 

కూచుపూడి వారి వీధి టైటిల్ తో శ్రీకాంత్ అడ్డాల సినిమా వస్తుందట. తెలుస్తున్న సమాచారం ప్రకారం సాయి ధరం తేజ్ ఇందులో హీరోగా నటించే అవకాశాలు ఉన్నట్టు చెబుతున్నారు. ఇక ఈ సినిమా తర్వాత వెంకటేష్, కమల్ సినిమా ప్రయత్నాలు చేస్తా అంటున్నాడు శ్రీకాంత్. ప్రస్తుతం కమల్ హాసన్ ఇండియన్ 2 సినిమా చేస్తున్నాడు. దాదాపుగా అదే ఆయన ఆఖరి సినిమా అంటూ చెప్పుకొచ్చాడు. మరి శ్రీకాంత్ డైరక్షన్ లో కమల్, వెంకీ కలిసి నటిస్తారా లేదా అన్నది చూడాలి. 



Related Post

సినిమా స‌మీక్ష