బాహుబలి రికార్డులు క్రాస్ చేసిన కె.జి.ఎఫ్

January 18, 2019


img

ఇండియన్ సినిమా రికార్డులను సైతం బ్రేక్ చేసిన బాహుబలి సినిమా రికార్డులను తిరగరాశాడు కన్నడ స్టార్ హీరో యశ్. ప్రశాంత్ నీల్ డైరక్షన్ లో భారీ బడ్జెట్ తో వచ్చిన కె.జి.ఎఫ్ మూవీ డిసెంబర్ 21న భారీ స్థాయిలో రిలీజైంది. తెలుగు, తమిళ, కన్నడ, హింది భాషల్లో రిలీజైన కె.జి.ఎఫ్ కన్నడలో ఇంకా హౌజ్ ఫుల్ కలక్షన్స్ తో దూసుకెళ్తుంది. ఈ సినిమా బాహుబలి రికార్డులను సైతం బ్రేక్ చేసేలా ఉంది. 

బాహుబలి సినిమా కన్నడలో 129 కోట్ల కలక్షన్స్ తో రికార్డ్ సృష్టించింది. అయితే ఇప్పటివరకు కె.జి.ఎఫ్ 121 కోట్ల దాకా రాబట్టిందని తెలుస్తుంది. ఇక కన్నడలో 100 కోట్లి దాటిన మొదటి సినిమాగా కె.జి.ఎఫ్ సరికొత్త రికార్డులను సృష్టించింది. కన్నడలో మాత్రం ఈ సినిమా తర్వాతే బాహుబలి అనేలా వసూళ్లు ఉన్నాయి. ఫుల్ రన్ లో అక్కడ బాహుబలి రికార్డులను సైతం క్రాస్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. కె.జి.ఎఫ్ చాప్టర్ 1 ఈ రేంజ్ లో ఉండగా చాప్టర్ 2 లో సంజయ్ దత్, రమ్యకృష్ణ లాంటి స్టార్స్ కూడా నటిస్తున్నారని తెలుస్తుంది.



Related Post

సినిమా స‌మీక్ష